11 ఏళ్ల బీజేపీ పాలనలో వికసిత భారత్ అమృతకాలం సమావేశం
అక్షర కిరణం, (విశాఖపట్నం): వికసిత భారతదేశపు అమృతకాలం సేవ సుపరిపాలన పేదల సంక్షేమానికి 11 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పరుశురామరాజు ఆధ్వ ర్యంలో సమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యుడు బి లక్ష్మణ్ విచ్చేసి ప్రసం గించారు. ఈకార్యక్రమంలో నార్త్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పీవీన్ మాధవ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గరపాటి సీతారామాంజినేయ చౌదరి, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ కేశవ కాంత్, బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.