నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం
అక్షర కిరణం, (హైదరాబాద్): నైరుతి బంగాళా ఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడిరది. వాయువ్య దిశగా 12కిమీ వేగంతో ఈ వాయుగుండం
కదులుతున్నట్టు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఇది చెన్నైకి 360 కి.మీ., పుదుచ్చేరికి 390 కి.మీ, నెల్లూరుకి 450కి.మీ దూరంలో ఉందని తెలిపారు. వాయుగుండం రేపు తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. ఈ వాయుగుండం ప్రభావంతో బుధవారం విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. దక్షిణకోస్తా రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు, పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉదని వివరించారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాగా వర్షాల కారణంగా తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో స్వల్పంగా బండరాళ్లు రోడ్డుపై పడ్డాయి. ఎక్స్కవేటర్లతో సిబ్బంది వాటిని తొలగిస్తున్నారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
మరోవైపు తిరుమల గిరుల్లో వర్షాలతో మాల్వాడిగుండం భారీగా ప్రవహిస్తోంది. కొండల నుంచి వస్తున్న నీటితో తిరుపతి కాలనీల్లోకి వరద వచ్చి చేరుతోంది.
తెలంగాణకు భారీ వర్ష సూచన
ఉరుములు, మెరుపులు ఈదురుగాలులు గంటకు 30-40 కి.మీతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.