ఒక్క రూపాయి అదనంగా తీసుకున్నందుకు రూ.10 వేల జరిమానా
అమ్మకపుదారుడిపై విశాఖలో న్యాయవాది చదరం అప్పారావు యుద్ధం
వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించి న్యాయం పొదిన వినియోగదాఆరుడు
అక్షర కిరణం, (విశాఖపట్నం): నిర్ణయించిన అమ్మకపు ధర (ఎమ్మార్పీ) కన్నా ఒక్క రూపాయి అదనంగా వినియోగాదారుడి నుంచి వసూలు చేయడాన్ని వినియోగదారుల కమిషన్`1 తప్పుపట్టింది. దీంతో అధికంగా వసూలు చేసిన ఒక్క రూపాయి వాపసు చేయడంతో వినియోగదారుడికి రూ.2500 ఖర్చులు, రూ. 10 వేల జరిమానా విధిస్తూ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్`1 తీర్పునిచ్చింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మర్రిపాలెంకు చెందిన న్యాయవాది చదరం అప్పారావు 2024 ఫిబ్రవరి 7న వేపగుంటలోని రిలయన్స్ స్మార్ట్ పాయింట్లో జిల్లెట్ రెగ్యులర్ షేవింగ్ క్రీం కొనుగోలు చేశారు. క్రీం ప్యాక్‌పై ఉత్పత్తిదారుడు రూ.75గా ధర ముద్రించారు. కాని అమ్మకందారు ఆ ధర కన్నా ఒక్క రూపాయి ఎక్కువగా రూ.76కు విక్రయించారు. ఈ విషయాన్ని అప్పారావు ప్రశ్నించినా సరైనా సమాధానం లేకపోవడంతో వినియోగదారుడు సంస్థ యాజమాన్యానికి అదే నెల 22న ఉత్తరం రాసినా బదులు ఇవ్వలేదు. దీంతో మార్చి 15న లీగల్ నోటీస్ కూడా పంపించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో వినియోదారుడు వివాదాల పరిష్కార కమిషన్ 1లో ఫిర్యాదు దాఖలు చేశారు. ఇరు పక్షాల వాదనలు, సాక్ష్యాధారలను పరిశీలించిన కమిషన్ 1 అధ్యక్షురాలు డాక్టర్ జి. తనూజ, సభ్యులు వర్రి కృష్ణమూర్తి పై విధంగా తీర్పునిచ్చారు. వినియోగదారుడి వద్ద నుంచి అదనంగా తీసుకున్న ఆ రూపాయి వెనక్కు ఇచ్చేయాలని దీంతోపాటు ఖర్చుల కోసం మరో రూ.2500 చెల్లించాలని, నష్టపరిహారం కింద ఇంకో పది వేల రూపాయలు చెల్లించాలని అమ్మకపుదారుడిని ఫోరం ఆదేశించింది.