logo
రాజకీయ సంబంధితమైనవి

అసమ్మతి నేతలు పోటీ చేస్తే సస్పెన్షన్ తప్పదు

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార కూటమిలో రెబల్ అభ్యర్థుల వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిం ది. పార్టీ నిర్ణయాన్ని కాదని స్వతంత్రంగా బరిలో నిలిచే అభ్యర్థులు వెంటనే నామినేషన్లు ఉపసంహరించుకోవాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

టీడీపీతో 40 ఏళ్ల అనుబంధానికి గుడ్ బై

ఉత్తరాంధ్ర రాజ కీయాల్లో, టీడీపీలో సీనియర్లుగా ఉన్న గుండ కుటుంబం 40 ఏళ్ల బంధానికి గుడ్ బై చెప్పింది. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి టీడీపీకి రాజీనామా చేస్తున్నాట్టు ప్రకటించారు. 40 ఏళ్లుగా తాను, తన భర్త టీడీపీలో పనిచేశామని.. ఇప్పుడు పార్టీని వీడుతున్నందుకు బాధగా ఉందని లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేశారు

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

3 వార్డులకే పోటీ చేస్తున్నాం

ఏపీలో స్థానిక సంస్థ లకు సంబంధించి అధికార కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి వస్తోంది. సీట్ల పంపకాలపై కూటమి పార్టీల నేతల చర్చించుకుని ఓ నిర్ణయానికి వస్తున్నారు.

Continue Read
సాధారణ వార్తలు

రూ.4.52 కోట్లతో ఆధునాతన పరికరాలతో జీజీహెచ్‌లో వైద్య సేవలు బలోపేతం

: పేద ప్రజలకు కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా నాణ్యమైన వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందించాలనే లక్ష్యంతో శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్) అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసు కుంటున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.

Continue Read
సాధారణ వార్తలు

ఏపీలో మోగిన స్థానిక ఎన్నికల నగారా ఈనెల 28న 10 నగర పంచాయతీలు 13 కార్పొరేషన్లు 77 మున్సిపాలిటీలకు ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపునేఠా ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలను నిర్వహిం చేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 10 నగర పంచాయతీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలకు అక్టోబర్ 28న ఎన్నికలు జరుగుతాయి. 30వ తేదీన ఫలితాలను వెల్లడిస్తారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

మేయర్ పీఠం వెనుక పట్టు.. రిజర్వేషన్‌పై గుట్టు

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్ పీఠం ఎవరికి దక్కనుంది? రిజర్వేషన్ ఏ వర్గానికి అనుకూలించనుంది? జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రశ్నలు జిల్లా వ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మేయర్ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించారనే వార్తల నేపథ్యంలో అవకాశం  మహిళా నాయకత్వం, బీసీల ప్రాతినిధ్యం, పార్టీల అభ్యర్థుల ఎంపికపై చర్చకు ఆస్కారం ఏర్పడింది.

Continue Read
సాధారణ వార్తలు

ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు

: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేసింది.. ఈమేరకు జీవో ఆర్టీ నంబర్ 1985ను సీఎస్ సాయిప్రసాద్ జారీ చేశారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న పలువురు అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించారు. 2002 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ సౌరభ్ గౌర్‌కు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పోస్టింగ్ ఇచ్చారు.

Continue Read
సాధారణ వార్తలు

ఏపీకి రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పాటు ఏపీలో పర్యటించను న్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 14న ఆమె రాష్ట్రానికి రానున్నారు. విజయవాడ కేంద్రంగా సాగే ఈ పర్యటనలో ఆమె ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకుంటారు. అలాగే మహిళా సాధికారతకు ప్రతీకగా నిలిచే ‘సరస్ మేళా’లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

Continue Read