ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు
అమ్రపాలికి కీలక బాధ్యతలు
వెయిటింగ్లో ఉన్న వారికి పోస్టింగ్‌లు
అక్షర కిరణం, (అమరావతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేసింది.. ఈమేరకు జీవో ఆర్టీ నంబర్ 1985ను సీఎస్ సాయిప్రసాద్ జారీ చేశారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న పలువురు అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించారు. 2002 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ సౌరభ్ గౌర్‌కు ఢిల్లీలోని ఏపీ భవన్లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పోస్టింగ్ ఇచ్చారు. 2006 బ్యాచ్ ఐఏఎస్ డి మురళీధర్ రెడ్డికి గిరిజన సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శిగా బాధ్యతలను అప్పగించారు. 2009 బ్యాచ్ ఐఏఎస్ మంజులే బాలాజీ దిగంబర్‌కు ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు.
2010 బ్యాచ్ ఐఏఎస్ కాటా ఆమ్రపాలిని పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రభుత్వ కార్యదర్శిగా నియమించారు. 2017 బ్యాచ్ ఐఏఎస్ కె నీలకంఠారెడ్డికి యువజన సేవల డైరెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. 2017 బ్యాచ్ ఐఏఎస్ బి అనిల్ కుమార్ రెడ్డికి పరిశ్రమలు, ఎంఎసఎంఈ శాఖ సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. 2018 బ్యాక్ ఐఏఎస్ ఎన్ తేజ్ భరత్‌ను ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా ప్రభుత్వం నియమించారు. ఐఏఎస్ గెడెల శ్రీనుకుమార్‌కు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ ఉప కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. ఐఏఎస్ ఎం వరప్రసాద్‌ను ఏపీ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు.
2014 బ్యాచ్ ఐఏఎస్ కె. శ్రీనివాసులుకు వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు.. 2013 బ్యాచ్ ఐఏఎస్ రవి సుభాష్‌ను ఈ బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. 2020 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శుభం బన్సాల్‌కు ఏపీ రాష్ట్ర ఆర్థిక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.. 2005 బ్యాచ్ ఐఏఎస్ యువరాజ్‌ను ఈ బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. ఐఏఎస్ అధికారుల పోస్టింగులు, అదనపు బాధ్యతలు వెంటనే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు వెయింట్‌లో ఉన్న ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు ఇచ్చారు.
ఏపీ ప్రభుత్వం ఈ బదిలీల్లో సీనియర్ ఐఏఎస్ అధికారిణి అమ్రపాలికి మరోసారి టూరిజంలోనే పోస్టింగ్ కేటాయించడం విశేషం. ఆమె సెలవుపై వెళ్లగా, ఆ సెలవులు పూర్తయిన తర్వాత రిపోర్ట్ చేయలేదు. దీంతో ఆమెకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు.. ఇప్పటి వరకు వెయిటింగ్లో ఉన్నారు. ఆమె తాను మళ్లీ విధుల్లో చేరుతానని కోరవడంతో పోస్టింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమెను పర్యాటక, సంస్కృతి శాఖ కార్యదర్శిగా నియమించారు. ఆమె గతంలో కూడా ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్లో పనిచేసిన సంగతి తెలిసిందే. మళ్లీ ఆమెకు అదే టూరిజం శాఖలోనే కార్యదర్శి స్థాయి పదవిని కేటాయించారు. ఆమ్రపాలి తెలంగాణ కేడర్ నుంచి ఏపీకి వచ్చిన సంగతి తెలిసిందే.