గాంధీనగర్ 46 అడుగుల రోడ్డుకు శంకుస్థాపన
అక్షరకిరణం, (పలాస/కాశీబుగ్గ): పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ యూనియన్ బ్యాంక్ రోడ్లో ఆక్రమించిన రోడ్డు నిర్మాణానికి అధికారులు నాయకులు నడుం బిగించారు. ఈస్థలంపై కేసు పలాస కోర్టులో ఉండగా 2024లో కేసును మున్సిపాలిటీ గెలవడంతో, కోర్టు వారికి ఆదేశాల అనుసారంగా అక్రమంగా ఉన్న కట్టడాలను తొలగించారు. ఇతర ప్రజలు స్థలాన్ని ఆక్రమించకుండా ఆ స్థలంలో రోడ్డు వేయడానికి పనులు ప్రారంభించారు. గురువారం పలాస ప్రజలు చిరకాల కోరిక గాంధీనగర్ 46 అడుగుల రోడ్డును గురువారం పలాస కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్, బల్ల గిరిబాబు, మున్సిపల్ కమిషనర్ నాగేంద్రకుమార్, వార్డ్ కౌన్సిలర్ ప్రసాద్ ఆధ్వర్యంలో రోడ్డు శంకుస్థాపన చేశారు.