కార్పెంటర్ కుటుంబానికి విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం రూ.35 వేలు ఆర్థిక సాయం
అక్షరకిరణం, (కాశీబుగ్గ): పలాస మున్సిపాలిటీకి చెందిన కార్పెంటర్ సింహాద్రి సురేష్ అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఆర్థికంగా వెనకబడిన ఆయన కుటుంబం రోడ్డున పడిరది. ఈ విషయం తెలుసుకున్న విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం పెద్దలు ఆ కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యాన్ని ఇస్తూ రూ.35 వేలు ఆర్థిక సహాయం అందచేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు కొత్తపల్లి చిన్నాచారి, వజ్రాల విష్ణు, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరకొండ షణ్ముఖరావు, స్వర్ణకార సంఘం అధ్యక్షులు కన్నాచారి, అండలూరి కోటి, సంతోష్, శ్రీను లక్ష్మణరావు, కొండపల్లి అర్జున్‌రావు కొత్తపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.