పీజీఆరఎస్కు 253 అర్జీలు
అక్షర కిరణం, (శ్రీకాకుళం): పీజీఆరఎస్కు సంబంధిం చిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని, దీనివలన మరింత మెరుగైన సేవలు పొందగలుగుతారని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక పీజీఆరఎస్, రెవెన్యూ సమస్యల పరిష్కా రానికి రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు జిల్లా పరిషత్ సమా వేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. అర్జీదారులు తమ అర్జీలను నేరుగా పీజీఆరఎస్ కార్యక్రమంలోగానీ, లేదా ఆన్‌లైన్‌తో మీకోసం వెబ్సైట్లో గానీ నమోదు చేసుకోవచ్చని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. నమోదైన అర్జీల స్థితిని తెలుసుకునేందుకు 1100 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయవచ్చని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్విని యోగం చేసుకోవాలని కోరారు. సోమవారం నిర్వహిం చిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక పీజీ ఆరఎస్ కార్యక్రమానికి ఆన్‌లైన్‌తో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి మొత్తం 253 ఫిర్యాదులు నమోదయ్యాయి. ప్రజల నుంచి అందిన ఈ వినతులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నేరుగా స్వీకరించారు. అందిన వినతుల్లో అత్యధికంగా రెవెన్యూ సీసీఎలఏ శాఖకు సంబంధించి 133 అర్జీలు రాగా, పంచాయతీ రాజ్ శాఖలో 16, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు 14, పంచాయతీ రాజ్ ఇంజినీ రింగ్‌కు 12, జలవనరుల శాఖకు 8, సర్వే సెటిల్మెంట్స్, ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో 8 వినతులు నమోద య్యాయి. స్వర్ణ గ్రామం - స్వర్ణ వార్డు కింద 6, సెర్ప్ విభాగంలో 6, కుటుంబ సంక్షేమ శాఖకు 5, టిడ్కో కింద 5 అర్జీలు వచ్చాయి. సమగ్ర శిక్ష, హౌసింగ్ కార్పొరేషన్, ఈపీడీసీఎల్ విద్యుత్ శాఖలకు చెరో 4 చొప్పున.. వైద్య విద్య, దేవాదాయ శాఖలకు చెరో 3 చొప్పున.. ఆరఅండ్‌బీ, గ్రామీణ నీటి సరఫరా ఇంజనీరింగ్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లకు చెరో 2 చొప్పున ఫిర్యాదులు అందాయి. వీటితో పాటు పశుసంవర్ధక, ఏపీఎసఆర్టీసీ, పాఠశాల విద్య, పోలీసు, మత్స్య, అటవీ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, రవాణా, గ్రామీణాభివృద్ధి, ఫ్యాక్టరీలు, ఏపీఐఐసీ, సివిల్ సప్లైస్, ఉద్యానవన, ఆర్థిక, వ్యవసాయ, ఇంటర్మీడియట్ విద్యా శాఖలకు సంబంధించి చెరో ఒక అర్జీ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అందిన ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్దేశిత గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్‌తోపాటు జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, జెడ్పి సీఈఓ వెంకట్ రామన్, తదితర జిల్లా అధికారులు వినతులు స్వీకరించిన వారిలో ఉన్నారు. గ్రీవెన్స్ తో పాటు సమాంతరంగా పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రెవెన్యూ క్లినిక్ కూడా నిర్ణయించారు.