జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికలకు 21 నామినేషన్లు దాఖలు
అక్షర కిరణం, (విశాఖపట్నం): ఆగస్టు 6న నిర్వహించే జీవీఎంసీ స్టాండిరగ్ కమిటీ సభ్యుల ఎన్నికకు జూలై 29న మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు 21 నామినేషన్లు దాఖలు అయ్యాయని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. జూలై 30 ఉదయం 11 గంటల నుండి నామినేషన్ స్క్రూట్నిని నిర్వహించిన తరువాత అదేరోజు అర్హత కలిగిన నామినేషన్ జాబితాను ప్రచురి స్తామని కమిషనర్ తెలిపారు. ఆగస్టు 2న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉహసంహరణకు గడువు ఉంటుందని తెలిపారు. ఆగస్టు 6న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ, ఓట్ల లెక్కింపు నిర్వహిస్తా మని తెలిపారు. అదే రోజున ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తా మని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు.