పోలీస్ బ్యారక్స్‌లో దివ్యాంగ పిల్లలకు 20వ ప్రత్యేక ఒలింపిక్స్ పోటీలు
అక్షరకిరణం, (విశాఖపట్నం): జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ వైజాగ్ ఈనెల 28న విశాఖపట్నంలోని పోలీస్ బ్యారక్స్ గ్రౌండ్లో 533 మంది దివ్యాంగ పిల్లల కోసం 20వ ప్రత్యేక ఒలింపిక్స్‌ను నిర్వహించారు. కార్యక్ర మంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుండి 20 పాఠశాలలకు చెందిన వినికిడి, దృష్టిలోపం, శారీరక, మానసిక వైకల్యం ఉన్న చిన్నారులు పాల్గొన్నారు. షాట్‌పుట్, డిస్కస్‌త్రో, జావెలిన్, రన్నింగ్, రిలే రేస్, సాఫ్ట్‌బాల్ వంటి వివిధ క్రీడాఈవెంట్లు నిర్వహించారు. అండర్`12, 12-20, 21 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల బాల, బాలికల పోటీలు నిర్వహించారు. వినికిడి లోపం ఉన్న విద్యార్థులతో సంజ్ఞా భాషలో ‘జాతీయ గీతం’ పఠిం చడం, నేవీ మార్చ్ఫాస్ట్, దివ్యాంగ పిల్లల సాంస్కృతిక కార్యక్ర మాలు నిర్వహించారు. అన్ని విభాగాల్లో విజేతలకు పతకా లు, సర్టిఫికెట్లు, ఎక్కువ విజయాలు సాధించిన పాఠశాల లకు ప్రత్యేక ట్రోఫీలను అందించారు. అన్ని విభాగాల్లో అత్య ధిక విజయాలు సాధించిన పాఠశాలకు ఓవరాల్ ఛాంపి యన్షిప్ ట్రోఫీ బహుకరించారు. జేసీిఐ వైజాగ్ ప్రెసిడెంట్, జేసి చైతన్య వసంతవాడ, ప్రాజెక్ట్ చైర్ పర్సన్ డాక్టర్ చరిష్మా నడిపిల్లి, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు శ్రీకావ్య, రమేష్, జోన్ వైస్ ప్రెసిడెంట్, ప్రభాకర్ బొట్ట, జేసీఐ వైజాగ్ సభ్యులు సీపీ శంఖబ్రతా బాగ్చి, జేసీఐ 4వ జోన్ అధ్యక్షుడు సురేష్ గొంప, విశ్వం ఎండీ నితీష్నేమాని, డెస్టినో క్వాలిటీ సర్వీసెస్ ఎండీ గోవిందబాబు, డీజేటీ హైకా సీఈవో ఎస్డీ జోహిప్కా, ఆదిత్య అసోసియేట్స్ మేనేజింగ్ డైరెక్టర్ శివాజీ బుద్ధరాజు తదితరులు పాల్గొన్నారు.