20 నుంచి ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు
అక్షర కిరణం, (విశాఖపట్నం సిటీ): ఈనెల 20వ తేదీ నుండి వచ్చే నెల 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా పశువులకు వేసే గాలి కుంటువ్యాధి నిరోధక టీకాలను జిల్లా రైతాంగం వినియోగించుకొని ఆర్థికాభివృద్ధిని పొందాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పిలుపునిచ్చారు. పశు సంవర్ధక శాఖ రూపొందించిన పోస్టర్ను కార్యాలయంలో ఆవిష్కరించా రు. పశువులకు అత్యంత ప్రమాదకరంగా వ్యాప్తి చెందే ఈ గాలికుంటు వ్యాధిసోకితే పాల ఉత్పత్తి కుంటుపడి రైతాంగం తీవ్రమైన ఆర్థిక నష్టాలను ఎదుర్కోవలసిన పరిస్థితులు ఉన్నాయన్నారు. గ్రామాలకు వచ్చే పశు వైద్య సిబ్బందికి సహ కారం అందించి శత శాతం టీకాలు వేసేలా కృషి చేస్తే భవి ష్యతులో ఈ వ్యాధిని శాశ్వతంగా పారదోలే అవకాశాలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ ఉప సంచాలకులు డాక్టర్ చంద్ర శేఖర్ డాక్టర్ కరుణాకర్, సహాయ సంచాలకులు డాక్టర్ సజ్జ శ్రీనివాస్, డాక్టర్ మాదిన ప్రసాదరావు పాల్గొన్నారు.