అక్టోబరు 15న పైడితల్లమ్మ సిరిమానోత్సవం
కరాష్ట్ర పండుగగా నిర్వహణ
కఈవో డీవీవీ ప్రసాదరావు
అక్షర కిరణం, (విజయనగరం): ఉత్తరాంధ్ర ప్రజల కల్పవల్లి, విజయనగరం ప్రజల ఆరాధ్య దేవత శ్రీపైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి డి.వి.వి.ప్రసాదరావు వెల్లడిరచారు. సెప్టెంబర్ 20న ఉదయం 8 గంటలకు చదురుగుడి వద్ద పందిరి రాట, మండల దీక్షతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయని, అదే రోజు ఉదయం 11 గంటలకు వనం గుడి వద్ద ప్రారంభం అవుతాయన్నారు. అక్టోబర్ 30వ తేదీన వనం గుడి వద్ద ఉదయం 8 గంటలకు నిర్వహించే చండీ హోమం, పూర్ణాహుతి, దీక్ష విరమణతో ఉత్సవాలు ముగియనున్నాయని తెలిపారు.
తోలేళ్ల ఉత్సవం అక్టోబర్ 14వ తేదీ సోమవారం, ఉత్సవాల్లో ప్రధానఘట్టమైన సిరిమాను ఉత్సవం అక్టోబర్ 15వ తేదీ మంగళవారం నిర్వహిస్తామని తెలిపారు. పైడితల్లి జాతర వివరాలను మంగళవారం ఆయన ఇక్కడ అన్నప్రసాద భవనంలో ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావుతో కలసి మీడియాకు వివరించారు. అమ్మవారి అర్ధ మండల దీక్షలు అక్టోబర్ 10 నుంచి ప్రారంభం అవుతాయని పేర్కొ న్నారు. అక్టోబర్ 22న పెద్ద చెరువులో తెప్పోత్సవం నిర్వహి స్తామని, 29న ఉయ్యాల కంబాల ఉత్సవం నిర్వహిస్తామని చెప్పారు. అక్టోబర్ 27న కలశ జ్యోతి ఊరేగింపు వనం గుడి వద్ద నుండి జరుగుతుందని తెలిపారు.
పైడితల్లి సిరిమాను ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం 2019లోనే గుర్తించి ప్రకటించిందని, దీనిపై జి.ఓ. నెం. 108 జారీ చేసిందన్నారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారన్నారు. తిరుమల తిరుపతి దేవ స్థానం నుంచి కూడా పట్టువస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. అమ్మవారి ఉత్సవాల గురించి ఆలయ అనువంశిక ధర్మకర్త, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పూసపాటి అశోక్ గజపతి రాజు, స్థానిక శాసన సభ్యురాలు అదితి గజపతి రాజు, జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ లకు ఇప్పటికే తెలియజేశామని వెల్లడిరచారు. ప్రభుత్వం తరపున ఉత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను చేయాలని కోరామని చెప్పారు.