14న లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి
అక్షరకిరణం, (పలాస): సెప్టెంబర్ 14వ తేదీన నిర్వహించే లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని పలాస జూనియర్ సివిల్ జడ్జి (ఇన్చార్జి) బీఎంఆర్ ప్రసన్న లత తెలిపారు. పలాస జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్లో న్యాయవాదులు, పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జడ్జి ప్రసన్న లత మాట్లాడుతూ కక్షిదారులు కేసుల నుండి శాశ్వత విముక్తి పొందడానికి లోక్ అదాలత్ చక్కని వేదిక అని ఈ అవకాశం సద్వినియోగం చేసుకో వాలని జడ్జి కోరారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ కృష్ణ, న్యాయవాదులు, పోలీసులు పాల్గొన్నారు.