అక్రమంగా నిల్వ చేసిన 1596 ఎరువుల బస్తాలు స్వాధీనం
అక్షర కిరణం, (సాలూరు): సాలూరు మండలం మావిడి గ్రామంలో రైతు సేవాకేంద్రంలో అక్రమంగా నిల్వ చేసిన 1596 ఎరువులను స్వాధీనం చేసుకున్నట్టు సాలూరు మండలం వ్యవసాయ అధికారి, రెవెన్యూ, పోలీసు అధికారులు తెలిపారు. మావిడి గ్రామానికి చెందిన సత్తి శ్రీనివాస్ రెడ్డి అదేగ్రామంలో ఒకభవనంలో సుమారుగా 1596 బస్తాలు ఎరువులను అక్రమంగా నిల్వ చేస్తున్నారన్న సమాచారంతో, గ్రామంలో ఒక వ్యక్తి మండల వ్యవసాయ అధికారికి సమాచారం అందించగా, సాలూరు ఏడీఏ సత్యవతి, మండల వ్యవసాయ అధికారి శిరీష వారి అధ్యర్యంలో వీఆర్వో, పోలీసుల సహాయంతో సదరు అక్రమ ఎరువుల నిల్వ చేసిన రైతు సేవా కేంద్రంలో ఉన్న అధికారులు బృందం దాడులు నిర్వహించి, ఒకే చోట ఎక్కువ మొత్తంలో అక్రమంగా ఎరువు నిల్వ 1596 ఎరువులు బస్తాలను సోమవారం రాత్రి స్వాధీనం చేసుకు న్నామన్నారు. సాలూరు మండలం వ్యవసాయ అధికారి శిరీష, సాలూరు రూరల్ ఎసఐ రవీంద్ర రాజ్, రెవెన్యూ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.