కోల్కతాలో వైద్యురాలి హత్యాచారంపై నిరసన
అక్షరకిరణం, (పలాస): పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలో ట్రైనీ వైద్యురాలిని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై పలాసలో వైద్యులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు శనివారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి ఎమ్మెల్యే గౌతు శిరీష మద్దతు తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కేటీ రోడ్ మీదుగా కాశీబుగ్గ బస్టాండ్ వరకు ర్యాలీ సాగింది. అక్కడ మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా శిక్షణ వైద్యురాలిని అత్యాచారం, హత్య చేసిన ఘటనలో నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు.
వైద్య విద్యార్థిని కేసును సీబీసీఐడీకి అప్పగించాలి
సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ నాయకులు
అక్షరకిరణం (కాశీబుగ్గ): వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో 9 వ తేదీన మానవత్వం లేకుండా అత్యాచారం చేసిన మూక లకు కఠినంగా శిక్షించాలని ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించాలని సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ నాయకులు మద్దిల రామారావు, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు వంకల మాధవరావు డిమాండ్ చేశారు. సమాజంలో ఇటువంటి దురాగతాలు మళ్లీ చోటుచేసుకో కుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అఖిల భారత కిసాన్ మహా సభ జాతీయ కౌన్సిల్ మెంబర్ మద్దిల రామారావు డిమాండ్ చేశారు.