షేర్ హోల్డర్ల పిల్లలకు ప్రతిభా ప్రోత్సాహకాలు పంపిణీ
అక్షరకిరణం, (పలాస): సంఘ బాధ్యత తోనే ప్రోత్సాహకాలు కోపరేటివ్ బ్యాంక్ సంఘం బాధ్యతతో పనిచేస్తుందని అందువల్లే షేర్ హోల్డర్ల పిల్లలకు ప్రోత్సాహ కాలు అందిస్తున్నామని ద విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ ఆదినారాయణ శాస్త్రి అన్నారు. పలాస కో ఆపరేటివ్ బ్యాంక్ శాఖ కార్యాలయంలో పదోవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన షేర్ హోల్డర్ల పిల్లలకు ప్రతిభ పురస్కారాలను గురువారం అందజేశారు ఆయన మాట్లాడుతూ 90 శాతం మార్కులు సాధించిన టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు పురస్కారాలు ప్రతి ఏడాది అందజేస్తున్నామన్నారు. ఈ ఏడా ది పదో తరగతిలో 8 మందికి, ఇంటర్లో ముగ్గురికి చొప్పున 11 మందికి నగదు ప్రోత్సాహకం అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మేనేజర్ ప్రసాద్ ప్రకాష్, సభ్యులు అప్పారావు, రవీంద్ర, కార్యా లయ సిబ్బంది రంజిత్ కుమార్, దుర్గారావు, భరత్‌కుమార్, శివకృష్ణ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.