ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
కరాష్ట్రంలో 24 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు
అక్షర కిరణం, (అమరావతి): రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం మునిసిపాలిటీపై దృష్టి కేంద్రీకరించింది. ఈక్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 24 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీల్లో భాగంగా పలువురు కమిషనర్లను మాతృశాఖకు బదిలీ చేయగా, మరికొందరిని మున్సిపల్ శాఖ డైరెక్టర్‌కు రిపోర్ట్ చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.