హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాధులపై విద్యార్థులకు అవగాహన
అక్షర కిరణం, (పెందుర్తి): పెందుర్తి జూనియర్ కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ, ఎయిడ్స్, సుఖవ్యాధులు, డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. బుధవారం పెందుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రం ఏపీస్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, పెందుర్తి ప్రభుత్వాసుపత్రి ఐసీటీసీ ఆధ్వర్యంలో పెందుర్తి జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఆరోగ్య స్థితి మీకు తెలుసా? హెచ్ఐవీ, ఎయిడ్స్, ఎస్టీఐ అవగాహన కార్య క్రమం, యువత పాత్రను వివరించారు. విద్యార్థులు తీసుకో వాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు, హెచ్ఐవీ, ఎయిడ్స్ ఎస్టీఐకి దూరంగా ఎలా ఉండాలి వంటి అంశాలను ప్రభుత్వాస్పత్రి ఐసీటీసీ కౌన్సిలర్ సురేష్కుమార్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.