వేద ఆగమ పాఠశాలలో ఏపీఎస్సీఆర్పీసీ చైర్మన్ తనిఖీలు
అక్షర కిరణం, (సింహాచలం): సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేద, ఆగమ పాఠశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ (ఏపీఎస్సీఆర్పీసీ) చైర్మన్ కేసలి అప్పారావు, సభ్యుడు గోండు సీతారాం సందర్శించారు. వారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఈ పాఠశాలలో శాస్త్రాలను, వేదాలను, పాండిత్యాన్ని అభ్యసిస్తున్న కొంత మంది విద్యార్థుల మీద శారీరక దండన, అంతర్గత కుమ్ము లాటలు చోటుచేసుకోవడం వంటి అంశాలు కమిషన్ దృష్టికి వచ్చాయని తెలిపారు. ఈనేపథ్యంలో ఈ వేద ఆగమ పాఠశాలను సందర్శించి విద్యార్డులు, అధికారులు, సిబ్బంది తో జరిగిన సంఘటనపై ఆరా తీశారు. బాలల న్యాయ చట్టం ప్రకారం విద్యార్థులపై శారీరక దండన చేయరాదని తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీకాంతా చార్యులు సహాయ కార్యనిర్వహణ అధికారి రాజేంద్ర కుమార్ పాల్గొన్నారు.