కోల్కత్త అత్యాచార ఘటనపై జనసేన నిరసన
అక్షర కిరణం (ఎచ్చెర్ల/అమదాలవలస): కోల్ కతా లో పీజీ వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనను నిరసిస్తూ జనసేన ఎచ్చెర్ల నియోజకవర్గ ఇంచార్జ్ విశ్వక్సేన్ ఆధ్వర్యం లో రణస్థలం జంక్షన్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిం చారు. ఈ ఆందోళనలో ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుదిటి ఈశ్వరరావు మాట్లాడుతూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నిందితులను శిక్షించాలని కోరారు. విజయనగరం ఎంపీ కళిశెట్టి అప్పలనాయుడు, జి.సిగడం మండల అధ్యక్షులు మీసాల రవికుమార్, శ్రీకాకుళం జిల్లా జనసేన కార్యవర్గం వడ్డాది శ్రీను, బలరాం, చిరంజీవి, బాడాన జనా, కూటమి నాయకులు ముప్పిడి సురేష్, జగన్నాథం, కొప్పిశెట్టి లక్ష్మణ, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.
నేరస్తులను వెంటనే శిక్షించాలి: పేడాడ రామ్మోహన్
కోల్ కతాలో అత్యాచార సంఘటనను నిరసిస్తూ మంగళవారం సాయంత్రం ఆముదాలవలసలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్చార్జ్ పేడాడ రామ్మోహన్ రావు పార్టీ శ్రేణులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పట్టణంలోని వన్ వే జంక్షన్ మీదుగా పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది. వన్ వే జంక్షన్ వద్ద మనవహారం చేపట్టారు. నిందితులను వెంటనే శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.