ఏపీలో నామినేటెడ్ పదవుల సంబరం
కటీటీడీ చైర్మన్, పలు పదవులకు పేర్లు ఖరారు
అక్షర కిరణం, (అమరావతి): ఏపీలో నామినేటెడ్ సందడి ప్రారంభమైంది. పదవుల ఎంపిక కసరత్తు దాదాపు పూర్తయింది. ఎన్నికల్లో వివిధ కారణాలతో టిక్కెట్లు దక్కని వారికి చంద్రబాబు పెద్దపీట వేశారు. అదే సమయంలో జనసేనతోపాటు బీజేపీలోని కీలక నేతలకు సైతం పదవులు ఇవ్వనున్నారు. నామినేటెడ్ పదవుల ఎంపికపై ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్‌తో చంద్రబాబు చర్చించారు. ఆయన సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో నామినేటెడ్ పదవులకు సంబంధించి జాబితాలను ప్రకటించే అవకాశం ఉంది. వాస్తవానికి ఈనెల16న నామి నేటెడ్ పదవులను ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. కనీసం 30 శాతం పదవులను భర్తీ చేయాలని చూశారు. మూడు పార్టీల్లో కీలక నాయకుల పేర్లను పరిగణలోకి తీసుకు న్నారు. ఈ జాబితా కొలిక్కివచ్చినట్లు తెలుస్తోంది. అందుకే పేర్లు ప్రకటించేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.
ఏపీఐఐసీ చైర్మన్‌గా బొడ్డు వెంకటరమణ చౌదరి నియామకం దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది.
ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పేరును ఖరారు చేశారు. ఎన్నికల్లో ఆయన టిక్కెట్ త్యాగం చేశారు. త్యాగానికి ఫలితంగా కీలకమైన ఆర్టీసీ చైర్మన్ పదవి కేటాయించినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నాదెండ్ల బ్రాహ్మణ చౌదరి నియామకం దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఫుడ్ కమిషన్ చైర్మన్‌గా పార్టీ జాతీ య అధికార ప్రతినిధి పట్టాభి పేరు ఖరారు చేశారు. శాప్ చైర్మన్ గా పొలంరెడ్డి దినేష్ రెడ్డి పేరు ఖరారు చేశారు.
మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రెడ్డివాణి నియమితులయ్యే అవకాశం ఉంది. ఏపీ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నీలయపాలెం విజయ్‌కుమార్ ఎంపికైనట్లు తెలుస్తోంది. ఏపీ మారి టైం బోర్డు చైర్మన్‌గా గొంప కృష్ణ పేరు ఖరారు అయినట్లు సమాచారం. ఏపీవేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా సోము వీర్రాజు ఎంపిక దాదాపు ఖాయమేనని సమాచారం. ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు చైర్మన్‌గా షేక్ రియాజ్ పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా బొబ్బూరి వెంగళరావు, ఏపీ గ్రేనేట్బ్యూటిఫి కేషన్ కార్పొరేషన్ చైర్మన్‌గా బండ్రెడ్డి రామకృష్ణ, ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్‌గా విష్ణువర్ధన్‌రెడ్డిల పేర్లు ఖరారైనట్టు సమాచారం. ఏపీ స్వచ్ఛంద మిషన్ చైర్మన్‌గా పాతూరు నాగభూషణం, ఏపీ పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నిమ్మల కృష్ణప్ప, ఏపీ మీట్ కార్పొరేషన్ చైర్మన్‌గా అనిమిని రవి నాయుడు, ఎస్సీ కమిషన్ చైర్‌పర్సన్‌గా మాజీమంత్రి పీకల సుజాత, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా కిడారి శ్రావణ్ కుమార్ ఖరారైనట్టు తెలుస్తోంది.
ఏపీ ఎస్ఎంఐడిసి చైర్ పర్సన్‌గా రాయపాటి అరుణ.
లి తుడా చైర్మన్ గా దివాకర్ రెడ్డి, నెడ్ క్యాప్ చైర్మన్ గా ఉక్కు ప్రవీణ్ రెడ్డి, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నటుడు పృధీ¸్వరాజ్, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా మాజీమంత్రి ఆలపాటి రాజా నియమితులైనట్లు తెలుస్తోంది.