బాలికపై వృద్ధుడి అత్యాచారం
కనిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
అక్షర కిరణం, (కోటవురట్ల): కోటవురట్ల మండలం పాములవాక గ్రామ పరిధిలో బాలికపై వృద్ధుడు అత్యాచారా నికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళితే కోటవురట్ల మండలం పాములవాక గ్రామానికి చెందిన కోట పాములు (65) అదే గ్రామానికి చెందిన మూడున్నరేళ్ల బాలికపై అత్యాచారా నికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి చిన్నారి ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చింది. పోలీసులు ఘటనపై ఆరాతీసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.