కాశీబుగ్గ సీఐగా మోహనరావు బాధ్యతల స్వీకరణ
అక్షర కిరణం, (పలాస/కాశీబుగ్గ): పలాస మున్సి పాలిటీ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో బుధవారం సర్కిల్ ఇన్స్పెక్టర్గా గాడి.మోహనరావు బాధ్యతలు స్వీకరించారు. 2006లో ట్రైనీ ఎస్ఐగా కాశీబుగ్గలో విధులు నిర్వహించా నని ఆయన తెలిపారు. మున్సిపాలిటీ సమస్యలపై పూర్తి అవగాహన ఉండడంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని పురప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సీఐ గాడి మోహనరావు మీడియాతో మాట్లాడుతూ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యలపై దృష్టి సారిస్తానని, అందరి సహకారంతో నేర రహితంగా పట్టణంగా పలాసను తీర్చిదిద్దడానికి పాటుపడతానని సీఐ మోహన రావు ఈసందర్భంగా తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన సీఐకు పోలీస్స్టేషన్ సిబ్బంది తదితరులు అభినందనలు తెలిపారు.