ఘనంగా సర్ధార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు
అక్షర కిరణం, (పలాస): స్వాతంత్య్ర సమర యోధుడు రాజకీయ నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న గౌతు లచ్చన్న 115వ జయంతి శుక్రవారం నిర్వహించారు. పలాసలో ఉన్న సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి ఆయన మనువరాలు ఎమ్మెల్యే గౌతు శిరీష పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గౌతు లచ్చన్న అభిమా నులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వజ్జ బాబురావు, పి విఠల్రావు, లోడగల కామేశ్వరరావు, గాలి కృష్ణారావు, బడ్డ నాగరాజు, సప్ప నవీన్, జోగ మల్లి, రామక్రిష్ణ, చంద్రరావు, అనిల్ శర్మ, చక్రధర్, దడియాల నర్సింహులు, అంబటి క్రిష్ణమూర్తి, నాబెల్లి శ్రీను, కొరికాన శంకర్, స్వరం రాంబాబు, కొండే నర్సింహులు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.