మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు
అక్షర కిరణం, (పెందుర్తి): 97వ వార్డు చిన ముషిడివాడ కూడలి వద్ద ఉన్న మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతిని కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా మాజీ వైస్ ప్రెసిడెంట్ విన్నకోట రాము ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. విన్నకోట రాము మాట్లాడుతూ రాజీవ్ గాంధీ టెక్నాలజీని తీసుకువచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారన్నారు. దేశంలో ఎంతోమందికి ఉపాధి అవకా శాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు విశాఖలో స్టీల్ ప్లాంట్, బీహెచ్‌పీవీ వంటి ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించి నిరుద్యోగులకు ఉపాధి అవకా శాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని తెలిపారు కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధికి తూట్లు పొడి చి దేశాన్ని ప్రైవేటుపరం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా ఐక్యం గా కృషి చేస్తున్నామని రాహుల్ గాంధీ ప్రధాని అయితే మళ్లీ దేశం పురోభివృద్ధిలోకి వెళుతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ముక్కా రామనాయుడు ఆర్ఆర్. నాయుడు, ఎంవీ పాత్రుడు, వరప్రసాద్‌రావు, అజీమ్ తదితరులు పాల్గొన్నారు.