కాశీబుగ్గ ఇందిరా కాలనీలో గోమాంసం విక్రయాలు
అక్షరకిరణం (కాశీబుగ్గ): కాశీబుగ్గ ఇందిరా కాలనీలో గోమాంసం విక్రయాలు కలకలం సృష్టించాయి. విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ సభ్యులు విక్రయాలను అడ్డుకున్నారు. గో మాంస విక్రయదారులతో గొడవ పడి వధించడానికి సిద్ధంగా ఉంచిన రెండు పశువులను రక్షించి చినవాడాంలోని గోశాలకు తరలించారు. గోవుల ను వధించి మాంసాన్ని విక్రయిస్తున్న వారిపై కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాశీబుగ్గ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గోమాంసాన్ని, గోవుల చర్మాలను స్వాధీనం చేసుకొని, మాంసాన్ని విక్రయిస్తున్న ముర్ము అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన పై కాశీబుగ్గ ఏఎస్ఐ సంజీవరావు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. గో మాంసాన్ని విక్రయిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ సభ్యులు ధర్మారావు, కాళీ, రమణ తదితరులు డిమాండ్ చేశారు.