జిల్లా వ్యవసాయ సంచాలకుడు రాబర్ట్పాల్ ప్రకృతి వ్యవసాయ క్షేత్రం సందర్శన
అక్షర కిరణం, (సాలూరు): సాలూరు మండలం పరిధిలో వరి, ప్రకృతి వ్యవసాయంపై జిల్లా వ్యవసాయ సంచాలకులు రాబర్ట్ పాల్ మంగళవారం సాలూరు ఏడీఏ మధుసూదనరావుతో కలిసి క్షేత్ర పర్యటన చేశారు. బంగా రమ్మకాలనీలో కొట్యడ శ్రీనివాసరావు అనే రైతు వరి వేయ గా ఆర్జీఎల్ 7034 మినీ కిట్ వరి ప్రదర్శన క్షేత్రాన్ని సందర్శించారు. తరువాత అన్నంరాజువలస గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల ఏటీఎం మోడల్ ఫీల్డ్ పద్ధతిని పరిశీలించారు. ఆ తరువాత అక్కడే ఆగ్నేయాస్త్రం తయారీ విధానాన్ని పరిశీలించామని తెలిపారు. తదనం తరం మామిడిపల్లి రైతు సేవాకేంద్రంలో మూడు మండలా ల ఏపీసీిఎన్ఫ్ సిబ్బందితో సమావేశంలో పాల్గొన్నారు. ప్రతి రైతు సేవాకేంద్రంలో కనీసం ఒకఎకరాలో ప్రకృతివ్యవ సాయం రైతులతో చేయించాలని సూచించారు. సాలూరు లో ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబ్లో విత్తనపరీక్షను పరిశీలన చేయడం జరిగిందని అయన తెలిపారు.ఈకార్యక్రమంలో సాలూరు సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు, శ్రీమధుసూదనరావు, మండల వ్యవసాయ అధికారి అను రాధ పండా, గ్రామవ్యవసాయ సహాయకులు ప్రమీల, ఏపీ సీఏన్ఫ్ కోఆర్డినేటర్ శారద ఇతర సిబ్బంది పాల్గొన్నారు.