శిశు సంరక్షణ కేంద్రాలకు అనుమతులు తప్పనిసరి
కఏపీఎస్సీఆర్పీసీ చైర్మన్ కేసలి అప్పారావు
అక్షర కిరణం, (విజయనగరం ప్రతినిధి): శిశు సంరక్షణ కేంద్రాలు నిర్వహణకు చట్టబద్ధమైన అనుమతులు తప్పని సరిగా ఉండాలని ఏపీఎస్సీఆర్పీసీ చైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శిశు సంరక్షణ పునరా వాస కేంద్రాలు నిర్వహణకు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధ నలకు లోబడి అనుమతులు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ (ఏపీఎస్సీఆర్పీసీ) చైర్మన్ కేసలి అప్పారావు ఆదేశాలు జారీ చేశారు.
ఇటీవల కొంతమంది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్వచ్ఛంద సేవలు ముసుగులో నిరుపేద, అనారోగ్యంగా ఉన్న కుటుంబసభ్యులు పిల్లలను గుర్తించి వారిని స్వదేశీ, విదేశీ సంస్థలకు చెందిన దాతలు సమకూర్చిన నిధులతో నిర్వహిస్తున్నారన్నారు. అయితే బాలల ఆహారం, వసతి సౌక ర్యాలు, విద్యా, ఆరోగ్యం, రక్షణ, సంరక్షణ భద్రత విషయా లను గాలికి వదిలివేస్తున్నట్లు, బాలలు మృత్యువాత పడుతు న్నట్లు కమిషన్ దృష్టికి వచ్చిన నేపథ్యంలో కఠిన చర్యలు కోసం ఇటువంటి కేంద్రాలపై కమిషన్ ఉక్కుపాదం మోపే విధంగా జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తా మన్నారు. కొన్ని అనధికార కేంద్రాల్లో కలుషిత ఆహారం, మానసిక ఒత్తిడిలు, లైంగిక వేదింపులు, మృత్యవాతలు, అక్రమ రవాణా, అవయవ మార్పిడి వంటి కొన్ని అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వెలుగులోకి వస్తున్నా యని, వీటిని పూర్తి స్థాయిలో నివారించడానికి క్షేత్ర స్థాయి లో అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రభుత్వ అనుమతి పొందిన, పొందలేని శిశు సంరక్షణ పునరావాస కేంద్రాలు, విద్యా సంస్థలను గుర్తించి ఆయా జిల్లా స్థాయి సంబంధిత అధికారులకు ఈ నెలాఖరులోపు ధ్రువీకరించి నివేదికను సమర్పించాలని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సంస్థలను గుర్తించి శాఖాపర చర్యలు తీసుకోంటామని తెలిపారు.