వైద్యుల రక్షణకు స్పెషల్ టాస్క్ఫోర్స్
కకోల్కత హత్యాచార ఘటనపై సుప్రీంలో విచారణ
అక్షర కిరణం, (ఢల్లీి/జాతీయం): కోల్కతా హత్యాచారఘటనపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. మహిళలు, యువ వైద్యుల భద్రతపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటన భయానకం అని పేర్కొంది. 12 గంటలు ఆలస్యంగా ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారు?, ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించింది. ఆత్మహత్యగా ఎందుకు ప్రకటించారు? అని ఫైర్ అయింది. దీనిపై గురువారంలోగా దర్యాప్తు స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని సీబీఐకి ఆదేశం ఇచ్చింది. వైద్యుల రక్షణపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యుల భద్రత కోసం జాతీయ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. 10మంది ప్రము ఖ వైద్యులతో కూడిన జాతీయ స్థాయి టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో హైదరాబాద్కు చెందిన ఏషియన్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ నేషనల్ గ్యాస్ట్రాలజీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి చోటు దక్కింది. ఈకమిటీకి చైర్మన్గా వైస్అడ్మిరల్ డాక్టర్ ఆర్కే సరైన్ ఉండనున్నారు.