రాజీవ్ గాంధీకి కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి నివాళులు
అక్షర కిరణం, (విశాఖపట్నం): కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం నగర అధ్యక్షుడు వజ్జిపర్తి శ్రీనివాసరావు అధ్యక్షతన దివంగత రాజీవ్ గాంధీ జయంతి నిర్వహిం చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపరాణి, కిల్లి రామమోహనరావు విచ్చేశారు. బీచ్ రోడ్ లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ సేవాదళ్ కార్యదర్శి గంగాధర్, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస రావు, విశాఖ జిల్లా వైస్ప్రెసిడెంట్ సూర్యనారాయణ, సోదా దాసు సుధాకర్, ఎస్సీ సెల్ మాజీ చైర్మన్ వెంకటరావు, జమ్మలమడుగు నియోజకవర్గ పరిశీలకుడు పాసర్ల ప్రసాద్, మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షుడు బాష, వెంకటేష్, త్రినాధరావు, 28వ వార్డ్ అధ్యక్షులు కనకరాజు, యూత్ కాంగ్రెస్ సతీష్, శివ, వల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.