ప్రభుత్వ కార్యాలయాలకు పవన్ కళ్యాణ్ చిత్రపటం అందజేత
అక్షరకిరణం, (పలాస): పలాస ఆర్డీవో కార్యా లయం, తహసీల్దార్ కార్యాలయం, పోలీస్స్టేషన్లకు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ చిత్రపటాలను అందజే శారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి చిత్రపటంతోపాటు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్ర పటం కూడా ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించిన విషయం తెలిసందే. ఈమేరకు ఆర్టీవో భరత్ నాయక్‌కు, తహసీల్దార్ కార్యాలయంలో అధికారి సత్యంకు, పోలీస్ స్టేషన్‌కు జనసేన నాయకుడు నందిగాం ధర్మారావు ఈ చిత్రపటాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వంశీ కృష్ణ చౌదరి, దీన పాత్రో, కేదారనాథ్, ఉదయ్ కిరణ్, దిలీప్ పాత్రో, చక్రపాణి, ప్రశాంత్, శశి, సురేష్, ఆదర్శ తదితరులు పాల్గొన్నారు.