విశాఖలో జీసీసీ అధికారులతో మంత్రి సంధ్యారాణి సమీక్ష
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖపట్నం గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా స్రీ ్తశిశుసంక్షేమ, గిరిజన సంక్షేమశాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. తొలిసారిగా కార్యాలయానికి విచ్చేసిన మంత్రి సంధ్యారాణి కి జీసీసీ విశాఖపట్నం ఎండీ కల్పనకుమారి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అధికారులతో గిరిజన ఉత్ప త్తులపై మంత్రి సంధ్యారాణి సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ గిరిజనుల అనుబంధ ప్రాథమిక సంఘాల నెట్వర్క్తో గిరిజన ఉత్పత్తులకు మద్దతు ధరలను సక్ర మంగా అందించాలన్నారు. అడవులపై ఆధారపడి జీవిస్తున్న గిరిజన కుటుంబాల నుంచి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏవిధంగా సేకరిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ప్రైవేటు వ్యాపారులకు పోటీగా మిగులు వ్యవసాయ ఉత్పత్తులను గిరిజన రైతుల నుంచి భరోసా మార్కెట్ సేకరించటం, గిరిజన కుటుంబాలు సేకరించి, విక్రయించిన ఉత్పత్తులకు చేపట్టి ఆ ఉత్పత్తులకు మెరుగైన అమ్మకపు రాబడిని ఏ విధంగా నిర్దారిస్తున్నారని ఎండీ, ఇతర అధికారులను ప్రశ్నించారు. జీసీసీ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించి, లాభాల బాటలో నడపాలని ఆదేశించారు. పలు అంశాలపై మంత్రి అధికారులతో సమీక్షించారు.