నిరుపేద యువతి వివాహానికి ఆర్థిక సహాయం
అక్షర కిరణం, (హిరమండలం): హిరమందలం లోని ఒక నిరుపేద ఇంట్లో పెళ్లికి పాతపట్నం నియోజకవర్గ జనసేన నాయకులు కోరికన రవికుమార్, భవాని దంప తులు లక్ష రూపాయలు సహాయం అందజేశారు. మించుల నారాయణమ్మ బ్రాహ్మణ వీధిలో నివాసం ఉంటు న్నారు. భర్త మృతి చెందడంతో ఇద్దరు పిల్లలతో జీవిస్తు న్నారు. ఆమె రెండో కుమార్తె వివాహం విషయం ఆర్ఎస్ఎస్ కార్యకర్త నారాయణ రావుతో జనసేన నాయ కులు భవాని తెలుసుకున్నారు. దీంతో వివాహం ఖర్చుల నిమిత్తం తన తల్లితండ్రులు, జనసేనా నాయకులతో లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమం లో జనసేన నాయకులు క్రాంతికుమార్, మామిడి రామకృష్ణ, వికాస్, హరీష్, జీవన్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నారాయణ రావు, దిలేశ్వర్రావు, బ్రాహ్మణ వీధి ప్రజలు, రవి కుమార్, విశ్వనాధం, కె సంజీవ్‌రావు, బి సురేష్, అబ్బాయి, ఎం.శ్యాం, యూ గోవింద్ తదితరులు పాల్గొన్నారు.