కోస్ట్ గార్డు డీజీ రాకేశ్‌పాల్ కన్నుమూత
కరక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, తమిళనాడు సీఎం స్టాలిన్ సంతాపం
అక్షర కిరణం, (చెన్నై/జాతీయం): ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ రాకేశ్‌పాల్(59) కన్నుమూశారు. దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన చెన్నై వచ్చారు.
కేంద్ర మంత్రిని రిసీవ్ చేసుకునేందుకు చెన్నై విమానాశ్ర యానికి చేరుకున్నారు. అక్కడే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయారు. దీంతో ఆయనను వెంటనే రాజీవ్ గాంధీ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 7 గంటలకు కన్నుమూశారు. విషయం తెలుసుకున్న రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ దవాఖానాకు చేరుకొని రాకేశ్‌పాల్ భౌతికకాయానికి నివాళులర్పించారు. నేవీకి సంబంధించిన ఓ కార్యక్రమం లో పాల్గొనేందుకు కేంద్ర రక్షణ మంత్రి వస్తున్న నేపథ్యంలో ఆయన ఢల్లీికి ఆదివారం (ఆగస్ట్ 18) ఉదయం చేరు కున్నారు. ఈక్రమంలో గుండెపోటు వచ్చింది. 34 ఏళ్లు వివిధ హోదాల్లో కోస్ట్ గార్డుకు సేవలందించిన రాకేశ్‌పాల్ క్రమశిక్షణ, నిబద్ధత గల అధికారిగా గుర్తింపు పొందారు. రాకేశ్ పాల్ మృతదేహాన్ని సోమవారం (ఆగస్ట్ 19) ఢల్లీికి తీసుకువచ్చారు. రాకేశ్ మృతిపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపు తూ పోస్ట్ పెట్టారు. ‘ఎంతో సమర్ధత, నిబద్ధత కలిగిన అధికారిని కోల్పోయాం’ అని చెప్పుకొచ్చారు. ఆయన నాయ కత్వంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ దేశ సముద్ర భద్రతను బలోపేతం చేయడంలో పురోభివృద్ధి సాధించిందని తెలిపారు. వారి కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. చెన్నైలో కోస్ట్ గార్డ్ మారిటైమ్ రెస్క్యూ, కో ఆర్డినేషన్ సెంటర్‌ను ప్రారంభించేందుకు రాజ్‌నాథ్ సింగ్ చెన్నైకి వస్తున్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొనేందుకు కోస్ట్ గార్డ్ చీఫ్ రాకేశ్ పాల్ చెన్నైకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు గుండెపోటు వచ్చి కన్నుమూశారు.
రాకేశ్ పాల్ స్వరాష్ట్రం యూపీ. 2023లో ఆయన కోస్ట్ గార్డ్ 25వ డీజీగా నియమించబడ్డారు. ఆయన ఐఎన్ఏ పూర్వ విద్యార్థి. 1989 జనవరిలో ఆయన కోస్ట్‌గార్డ్‌లో చేరారు. ద్రోణాచార్య, ఇండియన్ నేవీ స్కూల్, కొచ్చి, యూకేలలో వృత్తిపరంగా నైపుణ్యాన్ని పెంచుకునేందుకు పలు కోర్సులు చేశారు. ఆయన కమాండర్, డిప్యూటీ డీజీ వంటి ప్రధాన బాధ్యతలను ఢల్లీిలోని కోస్ట్ గార్డ్ కార్యాల యంలో నిర్వర్తించారు. సమర్థ్, అహల్యాబాయి, సుచేత కృపాలానీ, సీ 03 వంటి భారత నౌకలకు సారథ్యం వహించారు. ఆయన నేతృత్వంలో కోస్ట్ గార్డ్ నిర్వహించిన ఎన్నో ఆపరేషన్లు విజయవంతమయ్యాయి. ఇటీవల పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు, కోట్లాది రూపాయాల విలువైన బంగారాన్ని పట్టుకోవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 34 ఏండ్ల పాటు కోస్ట్ గార్డ్ లో సేవలందించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.