ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులకు అస్వస్థత
కోట వురట్ల మండలం కైలాసపట్నంలోని ఓ మత సంస్థ పాఠశాలలో ఫుడ్ పాయిజన్
27 మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలు విశాఖ కేజీహెచ్‌కు ఏడుగురు తరలింపు
అక్షర కిరణం, (కోటవురట్ల): కోటవురట్ల మండలం కైలాసగిరి గ్రామంలో మత సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాథల పాఠశాలలోని షెల్టర్‌లో ఫుడ్ పాయిజన్ అయి చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం మధ్యాహ్నం ఆహారాన్ని తీసుకున్న వెంటనే చిన్నారులు అస్వస్థతకు గురికావడంతో ఇళ్లకు పంపించేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం చిన్నారుల పరిస్థితి విషమించడంతో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం వైజాగ్ విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు. ఫుడ్ పాయిజన్‌తో పిల్లలు అస్వస్థతకు గురైన వార్త నేపథ్యంలో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి అధికారులు చేరుకున్నారు. ఆర్డీవో జయరాం, డీఎస్పీ మోహన్ తదితరులు ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ముందుగా ఏడుగురు చిన్నారులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు చిన్నారులను తరలించారు. కాగా మొత్తం 86 మంది పిల్లలకు గాను 27 మంది ఫుడ్ పాయిజన్ అయి వాంతులు విరేచనాలతో అస్వస్థుల య్యారు. వారిలో 14 మందికి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా ముగ్గురు చిన్నారులు మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వారిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.