బియ్యపు గింజ పరిమాణంలో సూక్ష్మరాఖీ
కపలాస సూక్ష్మ కళాకారుడు కొత్తపల్లి రమేష్ ఆచారి కళాప్రతిభ
అక్షరకిరణం, (పలాస/కాశీబుగ్గ): పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 21వ వార్డుకు గాంధీనగర్‌కు చెందిన సూక్ష్మ కళాకారుడు అతి సూక్ష్మ బంగారు రాఖిని తయారు చేశారు. 19వ తేదీ సొమవారం రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని పలాసకు చెందిన సూక్ష్మకళాకారుడు కొత్తపల్లి రమేష్ ఆచారి కేవలం అర సెంటీమీటర్ సైజు రాఖీని తయారు చేశారు. బియ్యపు గింజ సైజులో పలుచటి బంగారపు రేకు పైన ఎటువంటి అతుకులు లేకుండా ఈ సూక్ష్మ స్వర్ణ రాఖీని తయారు చేసినట్లుగా తెలిపారు. ఇది కేవలం 0.10 మిల్లీగ్రామ్ బరువు ఉందని, 70 రూపాయలు విలువగల బంగారంతో తయారు చేసిన ట్లుగా ఆయన తెలిపారు. దీనిని తయారు చేసేందుకు సుమారు రెండు గంటల సమయం పట్టినట్టు చెప్పారు.