యూడబ్ల్యుజే ఉపాద్యక్ష, సహాయ కార్యదర్శులకు ఘనంగా సన్మానం
అక్షర కిఏపీరణం, (విశాఖపట్నం): ఆంధ్రప్రదేశ్ యూని యన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ 67వ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా నూతన కమిటీ ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గం ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన మెట్ట కృష్ణారావుని, సహాయ కార్యదర్శిగా ఎన్నికైన ఉద్యమం పేపర్ ఎడిటర్ గొండు అచ్యుత రావును ఘనంగా సన్మానిం చారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకుడు, సామ్నా రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు, యూనియన్ జిల్లా కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కర్రీ రాము, రావులవలస రామ చంద్రరావు, కోశాధికారి కిల్లి ప్రకాశరావు, ఉపాధ్య క్షులు కుర్మాణ చంద్రమోహన్, నాయుడు తదితరులు ఘనంగా సన్మానించారు. సన్మాన గ్రహీతలకు శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈసందర్భంగా సామ్నా రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మా రావు మాట్లాడుతూ యూనియన్ బలోపేతానికి సభ్యులంద రూ ఐక్యంగా ఉండి కృషి చేయాలన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి అనునిత్యం పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి యూని యన్లు కృషి చేస్తున్నాయని కొనియాడారు. యూనియన్ జిల్లా కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కే.రాము, రావులవలస రామచంద్రరావు మాట్లాడుతూ సమాజానికి ప్రభుత్వానికి విలేఖరులు వారథిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కోశాధికారి కిల్లి ప్రకాష్‌రావు మాట్లాడుతూ యూనియన్ సభ్యులు ఉద్యమాల్లో క్రీయాశీలకంగా పాల్గొన్నాలన్నారు. కార్య క్రమంలో పలువురు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.