విమ్స్‌లో ఓపీ సేవలు బంద్
కఅత్యవసర సేవలకు వైద్యులు సిద్ధం కవిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు
అక్షర కిరణం (విశాఖపట్నం సిటీ): కోల్‌కత్తాలో జరిగిన వైద్య విద్యార్థిని అత్యాచారం, హత్యకు నిరసనగా వైద్యులు చేస్తున్న బంద్‌కు విమ్స్ వైద్యులు సంఫీుభావం తెలిపారు. శనివారం ఉదయం ఏడు గంటలకు విమ్స్ ప్రాంగణంలో మానవహారంగా ఏర్పడి ఇటువంటి దుశ్చర్యల కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విమ్స్ డైరెక్టర్ కే రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నా మహిళలపై దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయని, వీటిపై కఠిన తరమైన చట్టాలు తీసుకు రావలసిన అవసరం ఉందని తెలియజేశారు. అత్యవసర సేవలకు వైద్యులు 24/7 అందుబాటులో ఉంటారని, శనివారం ఉదయం నుండి వైద్యురాలి మృతికి సంఫీుభావంగా విమ్స్‌లో ఓపీ సేవలను నిలిపివేసినట్టు డాక్టర్ రాంబాబు తెలిపారు.