డీఏస్సీలో సీఆర్పీలకు వెయిటేజీ ప్రకటించాలంటూ సీఎంకు వినతి
అక్షరకిరణం, (విశాఖపట్నం): డీఎస్సీలో సీఆర్పీలకు వెయిటేజీ ప్రకటించాలని సమగ్ర శిక్ష జిల్లా జేఏసీ ప్రతి నిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. త్వరలో నిర్వహిం చనున్న డీఎస్సీ 2024లో సమగ్రి శిక్షలో పనిచేస్తున్న సీఆర్పీ లకు వెయిటేసీ కల్పించాలని ఉద్యోగుల జిల్లా జేఏసీ నాయ కులు కోరారు. ఈమేరకు జేఏసీ ప్రతినిధులు ఎల్.చైతన్య విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. సమగ్ర శిక్షలో పన్నెండేళ్లుగా బీఈడీ, టెట్ పరీక్షలు పాసై చాలీచాలని జీతా లతో ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. ఇటువంటి సీఆర్పీలకు వెయిటేజీ ఇచ్చి న్యాయం చేయాలని ఆయన కోరారు. గతంలో ఐఈఆర్టీ టీచర్ల, అగ్రికల్చర్ తదితర విభా గాలకు వెయిటేజీ ఇచ్చిన ప్రభుత్వం విద్యా శాఖలో కీలక విధులు చేపడుతున్న సీఆర్పీలు ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లతోపాటు అర్హులైన ఇతర విభాగాల వారికి వెయిటేజీని ప్రకటించి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను కోరారు. దీనిపై వారు సానుకూలం గా స్పందించారని తెలిపారు.