జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం
ÅఏపీయÖడబ్లుజే వ్యవస్థాపక దినోత్సవంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ Åసీనియర్ జర్నలిస్టులకు సన్మానం
అక్షర కిరణం, (విశాఖపట్నం): జర్నలిస్టుల సమస్యలను పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తోందని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. గురువారం ద్వారకానగర్‌లోని ఓ ీVAటల్లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ యÖనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయÖడబ్ల్యుజే) 70వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇళ్ల స్థలాల పెండింగ్ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సమాజ శ్రేయస్సుకు సంబంధించిన వ్యవహారాల్లో మంచి వార్తలు రాసి ప్రభుత్వానికి ప్రజలకు వారథిగా జర్నలిస్టులు ఉండాలన్నారు. జర్నలిస్టులు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యÖనియన్ అధ్యక్షుడు రాము మాట్లాడుతూ తమ అసోసియేషన్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తోందన్నారు. యÖనియన్ కార్యదర్శి ఆర్ రామచంద్రరావు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఎటువంటి ఇబ్బందులు వచ్చిన వారిని ఆదుకోవడానికి తాము ముందుంటామని చెప్పారు. నేటి సమాజంలో పెరుగుతున్న పోటీని దృష్టిలో పెట్టుకుని విశ్లేషణాత్మకమైన వార్తలు రాసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సీనియర్ జర్నలిస్టులకు సన్మానం
ఈ సందర్భంగా విశాఖలో మÖడు దశాబ్దాలుగా పాత్రికేయ వృత్తిలో విశేష సేవలందిస్తున్న పలువురు సీనియర్ జర్నలిస్టు లను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. ఆయా పాత్రికేయుల సేవలను ఎమ్మెల్యే ప్రశంసించారు. సన్మాన గ్రహీతల్లో గాజువాకకు చెందిన గుప్త, అక్షర కిరణం పత్రిక ఎడిటర్ పూజారి సత్యనారా యణ, మన భూమి పత్రిక ఎడిటర్ పి.సత్యనారాయణ, ఆంధ్రలేఖ పత్రిక సంపాదకులు మెట్ట కృష్ణారావు, సీనియర్ పాత్రికేయులు మధుగోపాల్ తదితరులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భం గా సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ తమ సేవలను గుర్తించి అసోసియేషన్ సన్మానించడం ఆనందంగా ఉందన్నారు. తమను సన్మానించిన అసోసియేషన్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.