ఉత్తరాంధ్రకు పోలవరంతో గోదావరి జలాలు..
Åఎడమ కాలువ ట్రయల్ రన్, వచ్చే నెలలోనే ముహూర్తం
అక్షర కిరణం, (పోలవరం): ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు కల సాకారం కాబోతోంది.. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు నీళ్లను అందించేందు కు కీలక ముందడుగు పడింది. సెప్టెంబర్ మొదటి వారంలో ముఖ్య మంత్రి చంద్రబాబు గోదావరి జలాల కు హారతి ఇవ్వనున్నారు. దీని కోసం ముందుగా ట్రయల్ రన్ నిర్వహిం చారు. పోలవరం ఎడమ కాలు నిర్మాణ పనులు పూర్తి కావడంతో ట్రయల్ రన్లో భాగంగా కొంత దూరం నీళ్లు వదిలారు. కొంత మేర నీటిని పోలవరం ఎడమ కాలువలో 67వ కిలోమీటరు దగ్గర రెగ్యులేటర్ వరకు తీసుకువచ్చి ఆపారు.
బుధవారం అక్కడి నుంచి 85వ కిలోమీటరు క్రాస్‌బండ్ వరకు ట్రయల్ రన్‌గా నీళ్లు విడుదల చేస్తున్నారు.. అక్కడ కొంత నీళ్లు నిల్వ చేస్తారు. అలా 111వ కిలోమీటరు వరకు ట్రయల్ రన్ నిర్వహించాలని ఆలోచన చేశారు. ముఖ్య మంత్రి చంద్రబాబు 111 కిలోమీటరు దగ్గర అనకాపల్లి జిల్లాకు నీళ్లు వదిలేలా కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నారు. అందుకే ముందుగా ట్రయల్ రన్ నిర్వహించి నీళ్లు వదులు తున్నారు. సెప్టెంబరు 2 లేదా 3న ముఖ్యమంత్రి చంద్రబాబు అనకాపల్లి జిల్లాకు నీళ్లు విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గోదావరి వరద జలాలు పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతల పథకాల ద్వారా ఎడమ కాలువ నుంచి అనకాపల్లి వరకు ఇవ్వాలని ప్లాన్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలు ఎడమ కాలువ ద్వారా తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో ప్రవహిస్తాయి.
ఉత్తరాంధ్రకు గోదావరి జిలాల విడుదలపై హోమంత్రి అనిత ట్వీట్ చేశారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటి విడు దల ఉత్తరాంధ్ర రైతాంగానికి ఒక చారిత్రాత్మక ముందడు గుగా అభివర్ణించారు. సెప్టెంబర్ మొదటి వారంలో జర> ·నున్న జలహారతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారని తెలిపారు. సారిపల్లిపాలెంలో హోమంత్రి ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఘన స్వాగత ఏర్పాట్లు చేయాలని నిర్ణయించామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాయకరావుపేట మండలం సీతారాంపురం-పీఎల్ పురం వద్ద జలహారతి ఇస్తారని చెబు తున్నారు. ఉత్తరాంధ్రకు పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు ఛేరితే తాగునీరు, సాగునీరు, పారిశ్రామిక అవసరాలకు ఇబ్బందులు తొలగిపోతాయంటున్నారు.