అన్నా క్యాంటీన్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తనిఖీలు
అక్షర కిరణం (శ్రీకాకుళం /కోటబొమ్మాలి): కోటబొమ్మాళి మండలం కొత్తపేటలో ప్రజా దర్బార్ కార్యక్ర మంలో పాల్గొనడానికి విచ్చేసిన కేంద్ర మంత్రి.. అక్కడే ఉన్న అన్నా క్యాంటీన్‌ను తనిఖీ చేశారు. స్థానికులతో కలసి అక్కడ మధ్యాహ్న భోజనం చేశారు. అన్నా క్యాంటీన్లో స్థానికులకు భోజనాలను వడ్డించారు. అనంతరం స్థానికులతో కలసి ఆయన కూడా సామాన్యుడిలా ప్లేట్ పట్టుకుని భోజనం చేశారు. ఈ సందర్భంగా అక్కడివారితో కలసి భోజనం నాణ్యత, పరిసరాల శుభ్రత గురించి అడిగి తెలుసుకున్నారు. 5 రూపాయలకే నాణ్యమైన, రుచికరమైన భోజనం దొరుకుతుందని, ప్రతీ రోజు నాణ్యతలో, రుచిలో రాజీ పడరని స్థానికులు రామ్మోహన్ నాయుడు ప్రశ్నకు బదులివ్వడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. పప్పు, పెరుగు, రసం అన్నింటినీ పరిశీలించారు. అక్కడి వారితో కలసి మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి క్యాంటీన్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.