నల్సా ‘శిక్ష 2026’తో పేద పిల్లలకు సమగ్ర విద్య
అక్షర కిరణం, (శ్రీకాకుళం): సమాజంలోని నిరు పేద, బలహీన వర్గాల చిన్నారులు ఆర్థిక, సామాజిక కారణా లతో విద్యకు దూరం కాకుండా చూడటమే ‘నల్సా శిక్ష 2026’ పథకం ప్రధాన ఉద్దేశమని జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ కార్యదర్శి కే. హరిబాబు స్పష్టం చేశారు. శ్రీకాకుళంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రాంగణం లో గురువారం ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో నిర్వ హించిన ప్రత్యేక అవగాహన సదస్సులో ఆయన మాట్లా డారు. నల్సా రూపొందించిన ‘స్కీమ్ ఫర్ హోలిస్టిక్ ఇంక్లూషన్, నాలెడ్జ్ అండ్ స్కూలింగ్ త్రూ హెల్ప్ అండ్ యాక్సెస’ (శిక్ష)తో విద్యార్థులకు సమగ్ర విద్యా సహకారాన్ని అందించడమే లక్ష్యమని తెలిపారు. ప్రతి చిన్నారి విద్యా హక్కును పరిరక్షించి పాఠశాల విద్యను అందరికీ చేరువ చేసేందుకు న్యాయ సేవాధికార సంస్థలు నిరంతరం శ్రమిస్తున్నాయని పేర్కొన్నారు.
పిల్లలు మధ్యలోనే చదువును నిలిపివేయకుండా నిరోధిం చడం, అవసరమైన నిరుపేదలకు న్యాయపరమైన సహాయంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సంపూర్ణ అవగాహన కల్పించడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. సామాజిక బాధ్యతగా భావించి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, విద్యాశాఖ, ఇతర ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రైవేట్ విద్యాసంస్థలు ముందుకు వచ్చి అర్హులైన ప్రతి విద్యార్థికీ విద్యా అవకాశాలు దక్కేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు, యాజమాన్యాలు, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.