ఏపీటీపీసీ చైర్మన్గా వజ్జ బాబూరావు
అక్షర కిరణం, (పలాస): ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవులను ప్రభుత్వం ప్రకటించింది. పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. దీనిలో భాగంగా పలాసకు చెందిన వజ్జ బాబురావును ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీటీపీసీ)కి చైర్మన్గా నియమిస్తూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2024 ఎన్నికలలో కూటమి గెలుపుకోసం వజ్జ బాబు రావు చేసిన కృషికి కూటమి ప్రభత్వుం ఇప్పుడు ఈ చైర్మన్ పదవితో గౌరవం ఇచ్చిందని పార్టీ వర్గాలు వెల్లడిరచాయి. వజ్జ బాబూరావును ఏపీటీపీసీ చైర్మన్గా నియమించడంపై పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈసందర్భంగా టీడీపీ శ్రేణులు ఆయనకు అభినందనలు తెలిపారు.