విమానాలకు బాంబు బెదిరింపులపై కేంద్రం నిశిత పరిశీలన
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
అక్షర కిరణం, (ఢల్లీి/జాతీయం): విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్న ఘటనలను కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని పౌర విమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈకేసులను సంబంధిత ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయని ఆయన వివరించారు. మూడు విమానాలకు ఈవిధమైన బాంబు బెదిరింపులు చేసిన ఓ బాలుడిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశంలో విమానయాన కార్యకలాపాలు సురక్షి తంగా సాగేందుకు ఎన్డీఏ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నదని కేంద్ర మంత్రి వివరించారు.