కొత్త సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్న
ప్రతిపాదించిన జస్టిస్ చంద్రచూడ్ 11న చంద్రచూడ్ రిటర్మెంట్
అక్షర కిరణం, (ఢల్లీి/జాతీయం): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీకాలం వచ్చె నెల 11తో ముగియనుంది. దీంతో ఆయన వారసుడి గా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును సీజేఐ ప్రతిపాదించారు. ప్రస్తుత న్యాయమూర్తుల్లో ఆయనే సీనియర్ కావడంతో తదుపరి సీజేగా జస్టిస్ ఖన్నా నియమితులయ్యే అవకాశం ఉంది. దీంతో తన తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిం చారు జస్టిస్ చంద్రచూడ్. ఈసిఫార్సును కేంద్రం ఆమోదిస్తే భారత సర్వోన్నత న్యాయస్థానం 51వ సీజేగా జస్టిస్ ఖన్నా నియమితులవుతారు. పదవీకాలం ముగిసేలోగా ప్రస్తుత సీజేఐ లేఖ రూపంలో కేంద్ర న్యాయశాఖకు ప్రతిపాదనలు పంపుతారు. ఆ లేఖను ప్రధానమంత్రి పరిశీలన కోసం న్యాయశాఖ పంపనుంది. ఆయన ఆమోదం తర్వాత రాష్ట్రపతి వద్దకు చేరుకుంటుంది. చివరగా రాష్ట్రపతి అనుమతితో తదుపరి ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపడతారు. జస్టిస్ డి.వై. చంద్రచూడ్ తర్వాత జస్టిస్ ఖన్నా అత్యంత సీనియర్‌గా ఉన్నారు.
నవంబరు 11న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్ర చూడ్ పదవీవిరమణ చేయనున్నారు. మర్నాడు నవంబరు 12న జస్టిస్ ఖన్నా సీజేఐగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఆరునెలలపాటు ఆయన ఈ పదవిలో కొనసాగను న్నారు. వచ్చే ఏడాది మే 13న ఆయన పదవీ విరమణ చేస్తారు. జస్టిస్ చంద్రచూడ్ 2022 నవంబరు 9న జస్టిస్ యూయూ లలిత్ స్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్య తలు చేపట్టారు. ఇటీవల కాలంలో రెండేళ్లపాటు సీజేగా ఉన్నది చంద్రచూడ్ మాత్రమే. జస్టిస్ చంద్రచూడ్ తండ్రి జస్టిస్ విశ్వనాథ్ చంద్రచూడ్ సుప్రీంకోర్టు 16 ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అత్యధిక కాలం సీజేఐగా పని చేసింది కూడా ఆయనే. ఏకం గా 7 సంవత్సరాల 139 రోజులపాటు బాధ్యతల్లో కొనసాగారు.
ఎవరీ జస్టిస్ సంజీవ్ ఖన్నా
జస్టిస్ సంజీవ్ ఖన్నా 1960 మే 14 న్యూఢల్లీిలో జన్మించా రు. లాతర్వాత 1983లో ఢల్లీి బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకుని న్యాయవాదిగా హజరీ కాంప్లెక్స్‌లో జిల్లా కోర్టులో కెరీర్ ప్రారంభించారు. తర్వాత ఢల్లీి హైకోర్టు, ట్రైబ్యునళ్లకు మారారు. 2004లో ఢల్లీి నేషనల్ క్యాపిటల్ టెరిటొరీ స్టాం డిరగ్ కౌన్సిల్, ఇన్కమ్ ట్యాక్స్ స్టాండిరగ్ సీనియర్ కౌన్సిల్‌గా ఉన్నారు. ఢల్లీి హైకోర్టు అదనపు ప్రభుత్వ న్యాయవాదిగా.. క్రిమినల్ కేసుల్లో అమికస్ క్యూరీగా వ్యవహరించారు. 2005లో ఢల్లీి హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా.. మరుసటి ఏడాది శాశ్వత జడ్జిగా పదోన్నతి పొందారు.
ఢల్లీి జ్యుడీషియల్ అకాడమీ, ఢల్లీి ఇంటర్నేషనల్ ఆర్టిబర్ సెంటర్, డిస్ట్రిక్ట్ కోర్టు మధ్యవర్తిత్వ కేంద్రాలకు ఛైర్మన్‌గా ఉన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2019 జనవరి 18 నియమితులయ్యారు. ఏ హైకోర్టులోనూ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయకుండానే ఆయన ఈ పదవి పొందడం విశేషం.