సమస్యలు పరిష్కరించాలంటూ ఏయూ వీసీ కార్యాలయం వద్ద విద్యార్థుల ధర్నా
అక్షర కిరణం (కంచరపాలెం): ఆంధ్రాయూనివర్సిటీ హాస్టల్ విద్యార్థులకు పురుగులతో కూడిన భోజనం పెడుతున్నారని మంగళవారం రాత్రి నుంచి ఏయూ ప్రధాన ద్వారం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ప్రతి రోజు తినే ఆహారంలో బొద్దింకలు, పురుగులు ప్రత్యక్షమవు తున్నాయని యూనివర్సిటీ అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్న పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి నుంచి ఏయూ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నిరసన చేపట్టిన అధికారుల నుంచి స్పందన రాలేదని, తెల్లవారే వరకు అక్కడే బస చేసి బుధవారం ఉదయాన్నే వీసీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ధర్నా వద్దకు చేరుకున్న యూని వర్సిటీ అధికారులు వీసీకి, రిజిస్ట్రార్‌కు యూనివర్సిటీ ఎఫ్.ఎఫ్.ఐ కార్యదర్శి డి.వెంకటరమణ విద్యార్థుల సమస్యలు వివరించారు. యూనివర్సిటీ హాస్టళ్లలో భోజనం చాలా అధ్వానంగా ఉంటుం దని, ప్రతిరోజు తినే అన్నంలో పురుగులు, బోద్దింకలు ప్రత్యక్షమ వుతున్నాయని అవేదన వ్యక్తం చేశారు. దీనిపై గతంలో కూడా మూడుసార్లు ఆందోళన చేశామని యూనివర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ స్పంది స్తూ విద్యార్థుల సమస్యలపై కమిటీ వేశామని, కొన్ని సమస్యలు తక్షణమే పరిష్కారం చేస్తామని మిగిలినవి 15 రోజుల గడువు లో పూర్తి చేస్తా మని, ప్రతి హాస్టల్లో తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటా మని విద్యార్థులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ కమిటీ కార్యదర్శి డి.వెంకటరమణ, నాయ కులు కుసుమంజలి, అజయ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు అభిషేక్, దిశ నాయకులు అవినాష్, విద్యార్థులు సంజయ్, సోమేష్, హర్ష, వికాస్, ప్రగతి విద్యార్థులు పాల్గొన్నారు.