నారా లోకేష్‌తో ఎమ్మెల్యే ఎంజీఆర్ భేటీ
అక్షర కిరణం, (పాతపట్నం): రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో గురువారం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు (ఎంజీఆర్) కలిసి పాతపట్నం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని వినతి కోరారు. రాష్టంలోనే మొదటి ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్‌ను సొంత నిధులతో ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే ఎంజీఆర్‌ను నారా లోకేష్ అభినందించారు. పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి నారా లోకేష్‌కు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు విన్నవించారు. ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ బాబును కలసిన ఎమ్మెల్యే నియోజకవర్గం అభివృద్ధిపై చర్చించారు. నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి తనవంతు సంపూర్ణ సహకారం ఉంటుందని లోకేష్‌బాబు భరోసా ఇచ్చినట్లు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఈసందర్భంగా తెలిపారు.