ఆరోగ్యం కోసం ప్రతిరోజూ గుడ్లు తినాలి
కపొదుపు మహిళలకు ఎగ్ కార్డుల పంపిణీలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అక్షర కిరణం, (విజయనగరం): పోషకాహార లోపం నివారణకు ప్రతిఒక్కరూ రోజూ గుడ్డు తినాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పదిమంది పొదుపు సంఘాల మహిళలకు ఒక్కోక్కటి రూ.50 వేలు విలువైన ఎగ్ కార్టులను టీటీడీసీ మహిళా ప్రాంగణంలో శుక్రవారం పంపిణీ చేశారు. ఈ ఎగ్ కార్టులతో గుడ్లతో తయారు చేసిన వివిధ ఆహార పదార్ధాలను విక్రయించనున్నారు.
ఈసందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (ఎన్ఈసీసీ) రాష్ట్రంలో వెయ్యి మందికి ఎగ్ కార్టులను ఉచితంగా పంపిణీ చేయడానికి ముందు కు వచ్చినందుకు అభినందనలు తెలిపారు. మొదటి విడత గా రెండు నెలల్లో 250 ఎగ్ కార్టులను పంపిణీ చేస్తున్నా మని, తరువాత నెలరోజుల్లోనే మిగిలిన వాటి పంపిణీని పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ఇన్‌ఛార్జి పీడీ కె.సావిత్రి, జిల్లా సమాఖ్య అధ్యక్షు రాలు లక్ష్మి, స్త్రీనిధి మేనేజర్ కృష్ణంనాయుడు, డీపీఎం రాజ్‌కుమార్, ఎన్ఈసీసీకి చెందిన (ఎగ్‌కార్ట్) జోనల్ చైైర్మన్ అరవింద్, పలువురు డీపీఎంలు, ఏపీిఎంలు, డీఆర్ డీఏ అధికారులు, సిబ్బంది, జిల్లా సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.