టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు మేయర్ పీలా శ్రీనివాస్ జన్మదిన శుభాకాంక్షలు
అక్షర కిరణం, (విశాఖపట్నం): తెలుగుదేశం పార్టీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు జన్మదిన వేడుక లు సోమవారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకుడు, విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా మేయర్ పీలా శ్రీనివాస రావు కేక్ కటింగ్ చేశారు. కార్యక్రమంలో కూటమి కార్పొరే టర్లు వీరారావు, వెంకటరమేష్, రాజశేఖర్, బొమ్మిడి రమణ, మంగవేణి తదితరులు పాల్గొన్నారు. టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.